Nava Narasimha Kshetralu


1. Ahobilam Karnool Ahobila Lakshmi Narasimha Swami

అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం -అహోబిలం
-------------------------
నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్క్కటైన అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కి మీ దూరం లో ఉంది . నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశాపుని చిలిచి చెండాడిన క్షెత్రమిదెనని స్థల పురాణం చెబుతుంది . హిరణ్యకశాపుని చిలిచి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం ,అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం గా పేరు వచ్చింది అని చెబుతారు .
బ్రహ్మాండ పురాణం లో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది .
శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహ అవతారం లో స్థంబం నుంచి ఉద్బవిన్చినట్లు చెప్పే స్థంబాన్ని కూడా అహోబిలం లో చూడవచ్చు .
దిగువ అహోబిలం : లక్ష్మి నరసింహ స్వామి శాంతి మూర్తి ఆయె వెలసిన క్షేత్రం ఇది
ఎనిమిది కి మీ ఎత్తున కొండ పైన ఎగువ అహోబిల నరసింహుని చుడవొచ్చు . హిరణ్య కసపుడిని సంవరించి వికట హట్ట్ హాసాలు చేస్తూ అహోబిలమ కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి .
(1) భార్గవ నరసింహ స్వామి
(2) యోగానంద నరసింహ స్వామి
(3) చత్రపట నరసింహ స్వామి
(4) ఉగ్ర నరసింహ స్వామి
(5) వరాహ నరసింహ స్వామి
(6) మాలోల నరసింహ స్వామి
(7) జ్వాల నరసింహ స్వామి
(8) పావన నరసింహ స్వామి
(9) కారంజ నరసింహ స్వామి
నవ నరసింహ క్షేత్రాలు . ఫాల్గుణ మాసం లో ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి .


2.Yadhagirigutta Nalgonda Jhwala Narasimha Swami
నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహ స్వామి కి ఘనమైన చరిత్ర ఉంది . పూర్వం ఋష్య శ్రున్గుని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహా విష్ణ్వు ప్రత్యక్షమవ్వగా తనకు నరసిమ్హును మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసిమ్హుండు,యోగానంద నరసిమ్హుండు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొన్దపిఅన వెలసాడట . స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.ఇప్పుదు ఈ ప్రదేశాన్ని తొలచి ఇంకా విశాలంగా తిర్చిదిద్దరట. లోనికి దిగేముందు పంచముఖ ఆంజనేయ స్వామి కోవెల ఉంది . ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ పై గండబేరుండ నరసింహమూర్తి ఉంది గర్బ గుడి లో జ్వాల నరసింహ,యోగానంద నరసింహ మూర్తులు ఉన్నాయి . కొండపైన స్వామి వారి పుష్కరాని కూడా ఉంది . ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నాయమయిపోతాయని బక్తుల నమ్మకం . " నమో నరసింహయనంహ"

3. MalaKonda(Malyadhri)Prakasham Malyadhri Lakshmi Narasimha Swami

అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా లక్ష్మి నారసింహుడు జ్వాల రూపుడై దర్శనమిన్చ్చాదని ,జ్వాల నరసిమున్హి గ కొండ పైన వెలిసారు అని పురాణం గాథ . మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కందుకూరు - పామూరు రోడ్డు లో వలేటివారిపాలెం మండల పరిధి లో ఉండే ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారం లో ఉండటం తో ఈ ప్రాంతానికి మాలకొండ ,మాల్యాద్రి అని పేరు వచ్చాయి . ప్రకృతి శోబకు నిలయమైన మాలకొండ ఏకశిలా నిర్మితం కావడం విశేషం . జ్వాల నరసింహుని పూజించిన మారకందేయ ముని సమీపం లోని యేరు లో స్నానం ఆచరించారని అదే మార్కండేయ నది అని చెబుతారు .

4.Simhachalam Vishaka Krodhaakara Varaaha Lakshmi Narasimha Swami

విశాకపట్టననికి 16 కి మీ దూరం లో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండ పైన వెలసిన నరసింహ క్షేత్రం ఇది . నవ నరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి . ఈ దేవాలయాన్ని సుమారు 9 వ శతాబ్దమ లో నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి . గర్భాలయం లో స్వామీ వారు వరాహ ముఖం , మానవాకారం ,సింహపు తోక కలిగి ఉంటారు . వరాహ -నరసింహ మూర్తుల సమ్మేళనం లో వెలసిన ఈ స్వామి ని సింహాద్రి అని పిలుస్తారు . ఈ గుడి ముఖ మండపం లో ఒక స్థంబం ఉంది . దానిని కౌగిలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నేరువేరుతాయని భక్తుల విశ్వాసం . అద్బుతమైన శిల్ప సంపద ,అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి . "ఓం నమో నరశిమ్హయనంహ " వరాహ పుష్కరాని ---------------------- ఈ పుష్కరాని కొండ క్రింద ఆడవి వరం గ్రామం లో ఉంది . ప్రతి సంవత్సరం పుష్యమాసం లో స్వామి వారు తన దేవేరుల సమేతంగా కొండ దిగి వచ్చి పుష్కరాని లో ఉన్న భైరవ స్వామి ని దర్శించి అనంతరం కొండ కి చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతుంది .

5.Dharmapuri KarimNagar Bhargava Narasimha Swami


ధర్మపురి కి పొతే యమపురి ఉండదు అని చెబుతుంటారు . రాష్ట్రము లో ప్రసిద్ది గాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కరీంనగర్ పట్టాన కేంద్రానికి 75 కి మీ దూరం లో ఉంది . పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం , శ్రీ రామలింగేస్వరలయం , మసీదులు ప్రక్క ప్రక్కనే ఉంది అనాది నుంచి శైవ,వైష్ణవ ,ముసిలం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉంది . ఇక్కడ స్వామి వారు యోగానంద నారసింహ స్వామి గ భక్తుల అభిస్తములు నేరవేరుస్తున్నాడు . యమలోకం లో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి లో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం నివాసం ఎర్పర్చుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి . ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది . యమ ధర్మరాజు ని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవైతి . పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గం లో నడిపించి నలుగు పాదముల ధర్మం తో ఈ క్షేత్రాన్ని పరిపలించినందుకు ధర్మపురి ని పేరు వచ్చింది అని పురాణాలూ చేబుతునంయి

6.Vedhadhri Krishna Yoga Narasimha Swami

నవ నరసింహ క్షేత్రాలల లో ఒకటైన నరసింహ క్షేత్రం కృష్ణ నది ఒడ్డున చిలకల్లు కి 10 కి మీ దూరం లో విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారి లో ఉంది . ఈ క్షేత్రం లో నరసింహ స్వామి వారు 5 అవతారాల్లో కనిపిస్తాడు . జ్వాల నరసింహ స్వామి వ, సలిగ్రంహ నరసింహ స్వామి,యోగ నంద నరసింహ స్వామి , లక్ష్మి నరసింహ స్వామి , వీర నరసింహ స్వామి అవతారాల్లో దర్శనమిస్తారు . అద్బుతమైన కట్టడాలు,యోగముద్రలో ఉన్న నరస్మిహర్ స్వామి వారు భక్తులకు కనువిందు చేస్తారు . ఇక్కడ జరిగే స్వామి వారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా ,కనుల పండుగగా జరుగుతాయి .

7.Antharvedhi Thuurpu Godavari Aanandha Narasimha Swami

పరవళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అన్త్రవేది చేరుకోవొచ్చు . చాల పురాతనమైన ఆలయం లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వెలసిన ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . త్రేతా యుగం లో రావణ బ్రహ్మ ను సంహరించి శ్రీ రాముడు బ్రహ్మ హత్య పాతకం నుంచి విముక్తి ని పొందడానికి ఈ క్షేత్రాన్ని ధర్సించాడని పురాణాలూ చెబుతున్నాయి . అలాగే ద్వాపర యుగం లో అర్జనుడు తీర్థ్ యాత్రకు వెళ్తూ ఆగిన తీర్థం అన్త్రవేది . మాగా మాసం లో స్వామి వారికి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ గ జరుగుతాయి .

8.MangalaGiri Guntur Panakala Narasimha Swami

నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహ స్వామి దేవాలయం గుంటు జిల్లా మంగళగిరి లో ఉంది .చాల పురాతనమైన దేవాలయం ..దెవలయ గురుంచి మనకు బ్రహమైథ వార్త పురాణం లో వివరించాదం జరిగింది . కొండ మీద వెలసిన పానకాల నరసింహ స్వామి ఎంత పాత్రా తో పానకం పోసిన అందులో సగం త్రాగి సగం వేలకి క్రక్కటం జరుగుతుంది . కొండ గిగువన లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉంది . దీని ముందు ఎత్తైన గాలి గోపురం ఉంటుంది .

9.PenchalaKona Nellore Chathravati Narasimha Swami

నెల్లూరు జిల్లా లోని రాపూర్ మండల కేంద్రం లో గల పెంచల కోన క్షేత్రం లో లక్ష్మి నరసింహ స్వామి స్వయం భు గ వెలసిన క్షేత్రం . నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటి ఆయన పెంచలకోన లో స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై స్వయం భు గా వెలసిన్ ఉన్నాడు . బక్తుల పాలిట ఇలవేల్పు అయి బక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంమయాడు . హిరణ్యకస్యపున్ని సంహరించి మహౌగ్ర రూపం తో వెళ్తుంటే దేవతలు అందరు బయపదిపోయారు . అల శేష చలం కొండల్లో సంచరిస్తుండగా ఆయనకు చెంచు రాజు కుమార్తె ఆయన చెంచు లక్ష్మి కనిపించింది . ఆమె జగన్మోహన్ సౌందర్యం స్వామిని శాంతింప చేసింది . ఆ తరువాత ఆమెని వివాహం చేసుకొని పెంచలకోన ప్రాంతం లో వెలిసాడు అని స్థల పురాణం చెబుతుంది .