శ్రీ కృష్ణ జన్మాష్టమి


దశావతారాల్లో పరిపుర్ణవతరాలు రెండు . ఒకటి రామావతారం ,రెండవది కృష్ణావతారం
దైవాంశ సంబుతుడఅయనప్పటికీ పరి పూర్ణ మానవుడిగా జీవించి ధర్మానికి ప్రతిరుపముగా నిలబడినవాడు శ్రీ రాముడు , ధైవంశాసంబుతుడుగా పుట్టి అడుగడుగునా మానవత్వం లో దైవత్వాన్ని ప్రకటిస్తూ ,తానూ ఆచారిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచినా వాడు శ్రీ కృష్ణుడు .
మధురనగారి లో ,కంశుని చెరసాలలో దేవకీ వసుదేవులకు అష్టమ పుత్రుడు చిన్ని కృష్ణుడిగా జగన్నాథుడు అవతరించిన దినమే శ్రావణ బహుళ అష్టమి .
మట్టిలోని సర్వసంపదలు , సకల ఔశదులు, సమస్త నిధులు ఉన్నాయన్న నిజాన్ని లోకానికి తెలియ చెప్పడం కోసం మట్టి తిన్న మహా పురుషుడు .
చిన్న నాడు తనతో కలిసి చదువుకున్న సుదాముడిచ్చిన కేవలం పిడికెడు అటుకులతో తృప్తి చెంది అతనికి అష్ట ఐశ్వర్యాలు అనుగ్రహించి పవిత్ర స్నేహానికి నిలువెత్తు నిదర్శనగా నిలిచినా ఆప్తమిత్రుడు .
కురు క్షేత్ర సంగ్రామం లో పార్థునికి తన విశ్వా రూపం చూపించి "కర్మ చేసే ఆదికారం మాత్రమే నీకు కలదు, సర్వ కర్మలకు నేనే కర్తను నువ్వు కేవలం నిమిత్తమత్రుడవే అని గీతోపదేశం చేసిన జగద్గురువు .
కృష్ణ అంటే భక్తుల దుఃఖాలు పోగొట్టేవాడు అని అర్థం . కృష్ణ అని ముమ్మారు స్మరిస్తే చాలు సర్వ దుఃఖాలు తొలిగి సకల ఐశ్వర్యాలు పొందుతారు అని శ్రీ నారద పురాణం చెబుతుంది .
శ్రీ కృష్ణుడికి ఎనిమిది మంది బార్యలు :-
రుఖ్మిని ,సత్య బామ ,జంబావతి ,మిత్రవింద ,భద్ర ,నాగ్నజితి ,కాళింది ,లక్ష్మణ
శ్రీ కృష్ణపరమాత్మ జన్మాష్టమి నాడు సుర్యొదయముకు పూర్వమే చల్లని నిటి లో తులసిధలములు ఉంచి స్నానమాచరించిన వారికి సమస్తా పుణ్య తీర్థములలో స్నానమాచరించిన పుణ్యము లబిస్తుంది అని పురాణాలూ తెలియ చేస్తున్నాయి .
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేయడం ద్వారా లోక కళ్యాణానికి బాటలు వేసిన శ్రీకృష్ణుని దర్శిస్తే మన పాపాలు సైతం సంహరించబడుతాయి.
హిందూమతానికి ఆదర్శప్రాయ గ్రంధమైన గీతా సారాంశాన్ని అందించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మ దినమైన శ్రీకృష్ణాష్టమి వేళ శ్రీ కృష్ణ దేవాలయాలను దర్శిస్తే జన్మ జన్మలకు సరిపోయే పుణ్యఫలం భక్తుల సొంతమౌతుంది. అందుకే కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణ దేవాలయాలను గానీ, గౌడీయ మఠాలను గానీ దర్శిస్తే చాలా శుభప్రదం.
శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించిన సమయంలో కృష్ణ ధ్యాన శ్లోకములు పఠిస్తే చాలా మంచిది. అలాగే ఆ దేవదేవుని సన్నిధిలో అష్టోత్తర పూజను చేయిస్తే చేయించిన వారికి సఖల సుఖాలు సొంతమౌతాయి. దీనితోపాటు కృష్ణ సహస్రనామ పూజను కూడా చేయిస్తే చాలా మంచిది.
దేవాలయ సందర్శన వేళ శ్రీకృష్ణుని లీలా వినోద మాలిక శ్రీభాగవతం గ్రంధాన్ని కొని దాన్ని పఠించగల్గితే స్వర్గ సౌఖ్యం సొంతమౌతుంది. కృష్ణాష్ఠమి సందర్భంగా సన్నిహితులకు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందించడం శుభకరం.
కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణుని దేవాలయ నిర్వాహకులు సైతం శ్రీకృష్ణుని లీలలను తెలిపే వివిధ నృత్య నాటకాలను, శ్రీకృష్ణుని చరితకు సంబంధించిన ఉపన్యాసాలను ఏర్పాటుచేస్తే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.