Share This on Your Social Netowrkకృష్ణ జన్మాష్టమి
దశావతారాల్లో పరిపుర్ణవతరాలు రెండు . ఒకటి రామావతారం ,రెండవది కృష్ణావతారం దైవాంశ సంబుతుడఅయనప్పటికీ పరి పూర్ణ మానవుడిగా జీవించి ధర్మానికి ప్రతిరుపముగా నిలబడినవాడు శ్రీ రాముడు , ధైవంశాసంబుతుడుగా పుట్టి అడుగడుగునా మానవత్వం లో దైవత్వాన్ని ప్రకటిస్తూ ,తానూ ఆచారిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచినా వాడు శ్రీ కృష్ణుడు .
కృష్ణ జన్మాష్టమి శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది .కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది..

మధురనగారి లో ,కంశుని చెరసాలలో దేవకీ వసుదేవులకు అష్టమ పుత్రుడు చిన్ని కృష్ణుడిగా జగన్నాథుడు అవతరించిన దినమే శ్రావణ బహుళ అష్టమి .
మట్టిలోని సర్వసంపదలు , సకల ఔశదులు, సమస్త నిధులు ఉన్నాయన్న నిజాన్ని లోకానికి తెలియ చెప్పడం కోసం మట్టి తిన్న మహా పురుషుడు .
చిన్న నాడు తనతో కలిసి చదువుకున్న సుదాముడిచ్చిన కేవలం పిడికెడు అటుకులతో తృప్తి చెంది అతనికి అష్ట ఐశ్వర్యాలు అనుగ్రహించి పవిత్ర స్నేహానికి నిలువెత్తు నిదర్శనగా నిలిచినా ఆప్తమిత్రుడు .
కురు క్షేత్ర సంగ్రామం లో పార్థునికి తన విశ్వా రూపం చూపించి "కర్మ చేసే ఆదికారం మాత్రమే నీకు కలదు, సర్వ కర్మలకు నేనే కర్తను నువ్వు కేవలం నిమిత్తమత్రుడవే అని గీతోపదేశం చేసిన జగద్గురువు .
కృష్ణ అంటే భక్తుల దుఃఖాలు పోగొట్టేవాడు అని అర్థం . కృష్ణ అని ముమ్మారు స్మరిస్తే చాలు సర్వ దుఃఖాలు తొలిగి సకల ఐశ్వర్యాలు పొందుతారు అని శ్రీ నారద పురాణం చెబుతుంది .
శ్రీ కృష్ణుడికి ఎనిమిది మంది బార్యలు :-
రుఖ్మిని ,సత్య బామ ,జంబావతి ,మిత్రవింద ,భద్ర ,నాగ్నజితి ,కాళింది ,లక్ష్మణ
శ్రీ కృష్ణపరమాత్మ జన్మాష్టమి నాడు సుర్యొదయముకు పూర్వమే చల్లని నిటి లో తులసిధలములు ఉంచి స్నానమాచరించిన వారికి సమస్తా పుణ్య తీర్థములలో స్నానమాచరించిన పుణ్యము లబిస్తుంది అని పురాణాలూ తెలియ చేస్తున్నాయి .