Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

సమ్మక్క -సారక్క దేవాలయం ,జాతర - మేడారం
వరంగల్ జిల్లాలోని తాడ్వాయ మండల కేంద్రం లోని మేడారం గ్రామా మ లో జరిగే జాతరే సమ్మ -సారక్కల జాతరా. జిల్లాకేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములోతాడ్వాయి మండలములో ఉన్నమారుమూల అటవీ ప్రాంతమైన మేడారం లో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈచారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది .


కాకతీయ సేనలతో వీరోచితంగా పోరాడి మన్యం వీరవనితలు సమ్మక్క -సారక్క ల రక్తం చిందిన చోటే ప్రతిష్టించి గద్దెఅలకు ఆ వనదేవతలు మాఘ శుద్ధ పౌర్ణమి నాడు తరలి రావడం ,మరుసటి రోజు కొలువు తీరడం ,ఆ తరువాత రోజు వనదేవతలు వనప్రవేశం తో మూడు రోజుల జాతర ముగుస్తుంది . గిరిజనులకు ఇష్టమైన కుల దైవాలు సమ్మక్క-సారక్క ల జాతర ,నాగరిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి అంద చందాలతో అలరారే అడవిలో జరగటం వారికి పరమనందదాయకం . సంవత్సరం సంవత్సరం ఇక్కడికి వచ్చే వారి సంక్య పెరుగుతుంది . కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క -సారక్క .


జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణెరూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుతీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యదాస్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము)నైవేద్యము గా సమర్పించుకుంటారు.

Route Map :-