Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

పైడి తల్లి ఆలయం -విజయనగరం




విజయనగరం జిల్లాలోని పట్టణం లో వెలసి ఉన్న పైడి తల్లి దేవాలయం సుమారు 17 వ శతాబ్దానికి చెందినదిగ చెబుతారు . పైడి తల్లి గ్రామా దేవత,ప్రతి సంవత్సరం ఇక్కడ పైడి తల్లి అమ్మవారికి జాతర జరుగుతుంది .


ఉత్తరాంధ్రలో జరుపుకునే జాతరలలో పైడితల్లి జాతరకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూసలపాటి రాజుల సోదరిగా చెప్పుకునే పైడితల్లి విజయనగర రాజవంశీయురాలని చెపుతారు. అప్పటి విజయనగర రాజు విజయరామరాజుకు పైడితల్లి సోదరి అని చెపుతారు. ఉదయాన్నే ఆమెను చూడకుండా విజయరామరాజు ఏ పని మొదలుపెట్టేవారు కాదట.
బొబ్బిలి యుద్ధ సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడి తల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమికేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు విజయరామరాజు. ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఎవరికో కలలో కనబడి తాను కనకదుర్గ అమ్మవారిలో ఐక్యమయ్యాననీ, తన విగ్రహం పెద్ద చెరువులో ఉందని చెప్పిందట.




ఆమె చెప్పినట్లుగానే చెరువులో విగ్రహం కనబడింది. ఈ సంఘటన 1757 సంవత్సరంలో జరిగింది. ఇక అప్పటినుంచి ఆ విగ్రహానికి పూజలు చేస్తూ వస్తున్నారు. విజయదశమి ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే సిరిమాను ఉత్సవానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.






Route Map: