Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

వెంకటేశ్వర స్వామి దేవాలయం -కురుమూర్తి,మహబూబ్ నగర్ జిల్లా




మహబూబ్ నగర్ జిల్లాలోని కోతకోట పట్టణానికి సమీపం లో చిన్నచింతకుంట మండలం లో గల కురుమూర్తి గ్రామం లో వెలసిన కురుమూర్తి శ్రీనివాసుడు ఆలయం చాల మహిమన్మిథమైనది కురుమూర్తి స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు . 13వ శతాబ్దం లో నిర్మించిన అతి పురాతన దేవాలయం ఇది . ఈ క్షేత్రాన్నే పేదవాడి తిరుపతి గ కూడా పిలుస్తారు.


స్థల పురాణం :-
----------------
అప్పు తీర్చమని కుబేరుడు చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక శ్రీనివాసుడు సతి సమేతంగా తిరుమల విడి అక్కడినుంచి బయలుదేరి మర్గామద్యం లో ఈ ప్రాంతం లోనే కొద్దిసేపు విశ్రాంతి తిసుకున్నడాట .


తరువాత కృష్ణ నది లో స్నానం చేసి ఉత్తర దిశగా ప్రయానమవుతుండగా ఆ కృష్ణమ్మా వెంకటేశుడికి పాదరక్షలు బహుకరించిందట !!ఆ సందర్బం లోనే శ్రీవారు కురుమూర్తి లోని సప్తగిరుల పై కాంచన గుహ లో స్వయంభు వై వెలసారని స్కంద పురాణం లో గాథ !!స్వామి వారి ద దర్శనానికి వెళ్ళే దారి లో చిన్న గుట్ట కనిపిస్తుంది దాన్ని మోకాళ్ళ గుండు అని పిలుస్తారు.


స్వామి వారికి బహుకరించిన పాదుకలనే కాకతీయుల కాలం నుంచి నేటి వారకు ఏట ఉద్దాల సేవ పేరుతో ఉరెగిస్తున్నరని చరిత్ర చెబుతుంది . ఏట కార్తిక పుర్నమికి స్వామి వారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగ గ జరుగుతాయి . కుర్తుముర్తి జాతర చూడడానికి మన రాష్ట్రము నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు.


వెళ్ళు మార్గం :-
మహబూబ్ నగర నుంచి దేవరకద్ర కౌకుంట్ల మీదుగా ప్రయాణిస్తే స్వామి వారి దివ్య క్షేత్రం వస్తుంది !!





How to Reach:-
25 Kms away from Kothakota which is on the National Highway No. 7 in between Hyderabad and Kurnool.

Route Map:-