Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

బోయకొండ గంగమ్మ దేవాలయం
చిత్తూర్ జిల్లా పుంగనూరు పట్టణానికి 14 కి మీ దూరం లో ఉన్న బోయకొండ గంగమ్మ దేవస్థానం ప్రసిద్దిగాంచిన క్షేత్రాలలో ఒకటి. ఈ అలయం ఒక చిన్న కొండపై వెలసి వున్నది. ఇక్కడ నిత్య పూజలు జరుగు తున్నాయి. నవాబుల నుంచి ప్రాణ బయం ఉండడం వలన ఇక్కాద్ ప్రజలు జగన్మోహిని వేడుకొనగా ఆ అమ్మవారే గంగమ్మ తల్లి అయి ఇక్కడ వెలసి ఉన్నది అని స్థల పురాణం చెబుతుంది .నవాబులు పాలన సమయములో దక్షిణ భారతంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ధ్యేయంతో తమసేనలతో దండయాత్రలు చేస్తూ అక్కడి జమిందారులను, పాలెగాళ్లను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులను వసూలు చేస్తున్న సమయమది. పుంగనూరు సంస్థాన పరిసర ప్రాంతాలపై నవాబుల కన్నుపడింది.


గోల్కొండ నవాబు సైన్యాలు పుంగనూరు ప్రాంతంపై దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడం మొదలు పెట్టారు. ప్రజలు భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు. పుంగనూరువైపు వస్తున్న నవాబు పదాతి దశాలు చౌడేపల్లి వద్ద ఉన్న అడవులలో నివశించే బోయల, ఏకిల గూడేలలో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఎందరో మహిళలు బలాత్కారానికి గురయ్యారు. పౌరుషంతో ఎదుర్కొన్న అనేకమంది బలయ్యారు. నవాబుసేనలు కూడా హతమయ్యారు.


మరలా గోల్కొండనుండి విస్తృతసేన పుంగనూరు చేరింది. ఈ విషయం తెలుసుకొన్న బోయలు, ఏకల దొరలు కొండ గుట్టకు వెళ్లి జగజ్జనిని ప్రార్థించారు. వీరి మొర ఆలకించి శక్తి స్వరూపిణి తన ఖడ్గంతో హతమార్చడం ప్రారంభించింది. అమ్మవారి ఖడ్గ ధాటికి రాతి రాళ్లు సైతం నిట్టనిలువుగా చీలిపోయాయి.. (ఇప్పటికి కొండపై నిట్టనిలువుగా చీలి కనిపించే అతి పెద్ద రాయిని మనం దర్శించవచ్చు.) నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని శాంతింపజేయడానికి భక్తులు ఒక మేకపోతును బలియిచ్చి తమతోపాటు ఉండమని ప్రార్థించారు.


వారి కోరిక మేరకు వెలసిన అమ్మవారిని "దొరబోయకొండ గంగమ్మ"గా పిలవడం అలవాటైంది. కొండపైన హిందువులు కట్టుకొన్న సిర్తారి కోట, నల్లమందు పోసిన గెరిశెలు, గుట్టక్రింద అమ్మ నీరు త్రాగిన స్థలం గుర్తులు రాళ్లకు సైన్యం గుర్తులు, ఉయ్యాల ఊగిన రాళ్లు అమ్మవారి మహిమలను శాశ్వత నిదర్శనాలు.


కొండపై వెలసిన అతి సుందరమైన అమ్మవారి ఆలయం సమీపాన ఉన్న పుష్కరిణిలోని నీరు అతి పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం వల్ల సకల రోగాలు మటుమాయమవుతాయని, పంటలపై తీర్థాన్ని చిలకరిస్తే చీడలుతొలగుతాయని దుష్ట సంబంధమైన గాలి భయాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం.
బోయకొండ గంగమ్మకు సంతాన కల్పవల్లిగా పేరుంది. దక్షిణ భారతావనిలో ముఖ్యమైన శక్తి క్షేత్రంగా భసిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించ వలసిన క్షేత్రం.


Gangamma is the incarnation of Shakti. It is at diguvapalli, Chowdepalli(mandal), Chittoor (District), near Tirupati, Andhra Pradesh, her temple is dedicated to the sister of Venkateswara. The temple is located 18 km from punganuru, 150 km from bengaluru, 20 km from madanapalli.Centuries ago the tribals Boyas and Yelikas lived in the forest area around the hillock. They stood up and resented the repressive and automatic rule of the Nawabs. They retaliated against the Muslim soldiers and chased them. The Golconda Nawab rushed additional troops to crush the revolt. Boya tribals could not withstand the onslaught of the Muslim army and fled into the forest and prostrated near the hillock and prayed Almighty to save them. The spirit of the Goddess Shakti descended from the hillock, shielded the tribals and crushed the Nawab's army. Local people say that the Shakti has tied the heads of soldiers to banyan tree branches.


In the event of victory Boyas built the Gangamma temple, which saved them against evil forces and became famous for centuries. There is a huge well below the temple, and the water is believed to cure many skin ailments. Local people believe that the Pushkarini water is very powerful, and sprinkling it in the field will yield good crop. Devotees can test whether their wishes will be fulfilled by placing a flower on the head of the deity. Locals believe that if the flower falls on the right side it is positive and negative if it falls on the left. Once a year the temple Navartri festival brings in lakhs of people from all over India, particularly the south.

HOW TO REACH
By Road
Punganur is the Nearest Town to Boyakonda Temple. Punganur is 14 km from Boyakonda Temple. Road connectivity is there from Punganur to Boyakonda Temple.

By Bus
Choudpally APSRTC Bus Station , Punganur APSRTC Bus Station , Madanapally APSRTC Bus Station are the nearby by Bus Stations to Boyakonda Temple .APSRTC runs Number of busses from major cities to here.