కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం

---------------------------------------
గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం .త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమన్మితమైనది . కరీంనగర్ పట్టణానికి 125 కి మీ దూరం లో మంథని సమీపం లో దట్టమైన అడవి ,చుట్టూ ప్రకృతి రామయనితల మద్య ,గోదావరి నదికి దగ్గరలో వెలసిన ఈ క్షేత్రం చాల పురాతనమైనది . స్కాందపురాణం లో ఒక కాండం కాళేశ్వర క్షేత్ర మహత్యాన్ని వివరిస్తుంది .

గర్బ గుడి లో రెండు శివలింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత . దర్శించిన బక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తి నిస్తున్డటం తో యముడికి పని లేకుండా పోయిందట . అంతట యమ మహారాజు స్వామి ని వేడుకోగా అప్పుడు యమున్ని కూడా తన పక్కనే లింగాకారం లో నిల్చోమన్నాడట . ముక్తేస్వరున్ని చూచి యమున్ని దర్సించకుండా వెళ్తే మోక్ష ప్రాప్తి దొరకదు అని వాళ్ళని నరకానికి తీసుకోని పోవొచ్చు అని శివుడు చెప్పాడట . అందుకీ బక్తులు స్వామి ని దర్శించుకొని,కాళేశ్వర స్వామి ని కూడా దర్శించుకుంటారు .

ముక్తేశ్వర స్వామి లింగం లో మరో ప్రత్యేకత ఉంది .లింగమ్ లో రెండు రంద్రాలు ఉన్నాయి .ఈ రంద్రం లో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడ సమీపం లో ఉన్న గోదావరి ,ప్రాణహిత సంగమ స్థలం లో కలుస్తుంది అని చెబుతారు .

How to Reach:
---------------
By Road/Bus: hyderabad to Kaleswaram is 7 hours journey. by road.

భీమేశ్వరాలయం - ద్రాక్షారామం -Draksharamam (located in Draksharamam):
---------------------------------------


పంచారామ క్షేత్రాల్లో నల్గోవధైన ద్రాక్షారామమ తూర్పు గోదావరి జిల్లలో ఉంది . ఇక్కడ భీమేశ్వర స్వామి లింగాకారం లో ఉన్నాడు . లింగం సగ బాగం నల్లగా , సగ బాగం తెల్లగా ఉంటుంది . అర్ధనారిశ్వరుడు అనటానికి ఇది నిదర్శనం . ఇక్కడ లింగం 60 అడుగుల ఎత్తు ఉంటుంది . దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేయడం వలని దీనికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది . అద్బుతమైన శిల్ప సంపద ,మహాశివరాత్రికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి . ఆలయం లో వినాయకుడి తొండం కుడి చేతి మీదగా ఉంటుంది . కాశి లోని విశ్వేశ్వరాలయం లో కూడా ఇలాగె ఉంటుంది . చాళుక్యుల కాలం లో దేవాలయాన్ని నిర్మించినట్లు సాశానల ద్వారా తెలుస్తుంది ,

How to Reach:
-------------
Ramachandrapuram to Draksharamam = 11 km
Kakinada to Draksharamam = 28 km
Nearest tow Kakinada to RTC Busses available to Kakinada to Draksharamam.

Srisailam:
---------------------------------

ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో రెండవదైన శ్రీశైలం కర్నూల్ జిల్లా కేంద్రం లో వెలసింది . దట్టమైన నల్లమల అడువల మద్యలో నుంచి వెళ్తే మనకు శ్రీ బ్రహ్మరంబ మల్లికార్జున స్వామి దేవాలయం వస్తుంది . తెలుగు ప్రజల అదృష్టం ఏంటి అంటే శ్రీశైలం వెళ్లినవారికి ,జ్యోతిర్లింగం మరియు శక్తి పీటం దర్శనం అవుతుంది . ఈ దేవాలయం చుట్టూ ప్రక్కల చూడవలసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి .
స్థల పురాణం
-------------------
పూర్వం శిలదుడనే మహర్షి సంతానం కోసం పరమేశ్వరుని గురుంచి తపస్సు చేసాడు . శివుడు ప్రత్యక్షమై కోరుకోమనగా నీకు భక్తులు అయి ఉండే ఇద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు .
ఈశ్వరుని కృప వలన ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు నంది ,పర్వతుడు. వారు పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ముందుగ నంది వరం కోరుతూ , నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించి ఉండాలి , నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసదించమించమని కోరాడు అతని కోరికగా శ్రీశైలానికి 200 కి మీ దూరం లో మహానంది రూపాన్ని పొందాడు . ఆనాటి నుంచి శివుని వాహనముగా మారాడు . తరువాత పర్వతుడు వరం కోరుతూ నేను దాల్చి ,నీవు న పై వెలసి,నా పర్వత శికరాన్ని చుసిన మేరకు ఈశ్వరుడు జ్యోతిర్లింగా రూపం లో వెలిసాడు . పర్వతుడు శ్రీ పర్వతుడుగా అయ్యాడు ,కాల క్రమం లో శ్రీశైలం గ పిలువబడుతున్నది . శ్రిశైలన్ని ఈ భూమికి మొతానికి నాభి గ చెబుతారు . అందుకీ మనం ప్రపంచం లో ఎక్కడ ఉన్న సంకల్పం చేసేటప్పుడు శ్రిసైలష్య ఏ దిక్కున ఉంటె ఆ దిక్కు గురుంచి చేబుతుంటము .
ఈ దేవాలయం చాల పెద్దది . కృతయుగం లో హిరణ్య శివుడి పూజ మందిరంగా ఉంది . త్రేతా యుగం లో రాముడు ,సీత ఇక్కడ ప్రతిష్టించిన సహస్రలింగం ఇప్పటికి పుజలన్డుకుంటుంది .
తిరుపతి లో ఉన్నది ఆకాశ గంగ, శ్శ్రీశైలం లో ఉన్నది పాతాల గంగ . మన శ్రీశైలం వచ్చి వెళ్ళినట్లుగా సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి దేవాలయం ఇక్కడ ఉన్నది .
శ్రీశైలం చుట్టప్రక్కల చూడవలసిన దేవాలయాలు

సాక్షి గణపతి దేవాలయం
హటకేశ్వర స్వామి దేవాలయం
పాలధార పంచదార
శికర దర్శనం
ఖైలస ద్వారం
అక్కమాదేవి గుహలు
భీముని కొలను
గుప్తా మల్లికార్జున దేవాలయం
బ్రహ్మరంబ చెరువు


How to Reach:
------------
Hyderabad to Srisailam = 213km by Road