సూర్యనారాయణ దేవాలయాలు భారత దేశం లో చాల అరుదుగా ఉన్నాయి . శ్రీకాకుళం పట్టణానికి 2 కి మీ దూరం లో ఉన్న అరసవెల్లి లో వెలసిన ప్రసిద్ద సూర్య దేవాలయం . అరసవెల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయం .
శ్రీ మహావిష్ణువు అవతారమైన బలరాముడు ద్వాపర యుగమ లో జీవులనుద్దరించేందుకు తన నాగేటి చాలు తో నాగావళి నదిని అవర్బివిమప చేసి ఆ తీరాన దేవాలయాన్ని ప్రతిష్టించారు . దీనిని తిలకించడానికి దేవతలు స్వర్గమా నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు అట . ఇంద్రుడు ఒక్కడు వేళా కు రాలేకపోయాడు . రాత్రి సమయాన చేరుకొని కోటిశ్వర దర్శనార్థం రాగ నందీశ్వరుడు ఆటకయించాడు . ఇంద్రుడు కోపావేశం తో వజ్రాయుధం ఎత్తగా నందీశ్వరుడు తన కొమ్ములతో దానిని విసిరిపరేసదట . ఆ దెబ్బకు ఇంద్రుడు స్పృహ తప్పి అరసవెల్లి ప్రాంతం లో పడిపోగా స్వప్నం లో ఇంద్రుడికి సూర్య భగవానుని విగ్రహం ప్రతిష్టించి ఆరాధించమని సందేశం రాగ ఇంద్రుడు అలాగే చేసి ఆరోగ్యవంతుడై తిరిగి తనలోకనికి చేరుకున్నాడని స్థల పురాణం . ఈ క్షేత్ర స్వామి గ్రహదిపతి కావడం వాళ్ళ దర్శన మత్రమునె సర్వగ్రహహరిస్తా శాంతి లబిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి .
ఈ దేవాలయాన్ని 7 వ శతాబ్దం లో కళింగరాజులు నిర్మించినట్లు శాసనాల్ ఆధారం . ఈ దేవాలయం లో ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు సూర్యకిరణాలు మూల వీరట్టు పాదాల పైన పదుతయి.


-------------------------

Location: Arasavalli,Srikakulam
---------

How to Reach:
Road Transport : One can easily reach Arasavalli by road from any part of Andra pradesh.

Nandikotkuru Suyra Devalayam-Nandikotkuru,Kurnool
-------------------------------తెలుగు రాష్ట్రాల్లో సూర్య భగవానుని దేవాలయాలు అరుదు. అలంటి సూర్య నారాయణ స్వామి దేవాలయం కర్నూల్ జిల్లా నందికోట్కూరు లో దివ్య క్షేత్రమై వెలుగొందుతుంది . కర్నూలు జిల్లా నందికొట్కూరులోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ఈ క్షేత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాతః కిరణాలు నేరుగా స్వామివారి పాదాల్ని తాకుతాయి. ఆలయం మధ్యలో కూర్మయంత్రం ఉండటం మరో విశిష్టత. ఆ కారణంగానే, ఇక్కడ సూర్యారాధన చేసిన వారికి ఉత్తమ ఫలితాలుంటాయని చెబుతారు అర్చకులు. పదమూడో శతాబ్దంలో చోళవంశీయుడైన సిరిసింగరాయలు ఈ ప్రాంతానికి వేటకొచ్చాడు. అలసిసొలసి ఓ చెట్టు నీడన సేదతీరుతుండగా సూర్యభగవానుడు కలలో కనిపించి...అక్కడ తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. ఆ ఆనతి ప్రకారం సిరిసింగరాయలు చక్కని సూర్యాలయాన్ని కట్టించాడని ఐతిహ్యం.

గర్భాలయంలోని మూల మూర్తి కుడి చేతిలో తెల్లని పద్మం, ఎడమ చేయి అభయ ముద్రలో కనిపిస్తుంది. కాలక్రమంలో ఆలయం శిధిలావస్తకు చేరుకోగా.... పదహారేళ్ళ క్రితం భక్తులు ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకొని పూర్తి చేశారు. రధ సప్తమినాడు ఆలయంలో ఘనంగా కళ్యాణం నిర్వహిస్తారు. పరిసర జిల్లాలనుండి అనేక మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.

సూర్యోదయం జరిగే తూర్పు దిక్కునే ముందుగా సృష్టించాడట బ్రహ్మ. మాఘశుద్ధ సప్తమినాడు తొలిసారిగా సూర్యుడు ఏడుగుర్రాల రథమెక్కివచ్చి కర్మసాక్షిగా బాధ్యతలు స్వీకరించాడంటారు. ఆ సందర్భంగానే ఏటా రథసప్తమి జరుపుకుంటాం. సూర్యవ్రతాన్నీ నిర్వహిస్తాం. ఆరోజు, తలమీద ఏడు జిల్లేడు ఆకులు కానీ రాగి ఆకులు కానీ పెట్టుకుని తలస్నానం చేయడం సంప్రదాయం. కొత్తబియ్యం, కొత్త బెల్లంతో వండిన పాయసాన్ని చిక్కుడు ఆకులమీద వడ్డించి, నైవేద్యంగా పెడతారు. ముంగిళ్లలో రథం ముగ్గేసి సూర్యనారాయణుడికి ఆహ్వానం పలుకుతారు. ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్య కటాక్షం పొందుతారు.

వెళ్ళు మార్గం :- కర్నూల్ నుండి ఆత్మకూరు వెళ్ళే మార్గం లో 35 కి మీ దూరం లో నందికోట్కూరు ఉంటుంది

సూర్య నారాయణ దేవాలయం –బుదగావి
------------------
--------------------------------------------------------- మన తెలుగు రాష్ట్రాల్లో సూర్య దేవాలయాలు చాల అరుదు .. అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రం లో గల బుదగావి గ్రామం లో వెలసిన సూర్య నారాయణ దేవాలయం 13 వ శతాబ్దానికి చెందినదిగ శాసనాల ద్వార తెలుస్తుంది .చాళుక్యుల కాలం లో నిర్మించబడిన ఈ దేవాలయం లో సూర్య నారాయణ స్వామి దక్షిణం దిశగా మనకు దర్శనం ఇస్తాడు . 5 అడుగుల నల్లరాతి విగ్రహం తో స్వామి వారు ఇ క్షేత్రం లో ఎంతో దివ్యంగా ,రమణీయంగా ఉంటారు.స్వామి వారిని దర్శించడానికి రెండు కళ్ళు సరిపోవ అన్న విదంగా ఉంటారు.
ప్రత్యేక కార్యక్రమాలు :
రథ సప్తమి కి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి.
వెళ్ళు మార్గం :-
ఉరవకొండ నుండి 5 కి మీ దూరం లో మనకు ఈ దేవాలయం ఉంటుంది


Thirumalagiri Sun Temple


Sun Temple-Nambur

-------------------

Namburu is a suburban village in the Guntur District, Andhra Pradesh, India. It is between the cities of Guntur and Vijayawada.The Namuburu railway station is part of the Guntur division of the South Central Railway. It is the closest railway station for Acharya Nagarjuna University.