1. శాంకరీదేవి :Trincomalee:
--------------------


ట్రింకోమలి( శ్రీలంక) లోని ఒక కొండపై శిథిలాలయాన్నే శాంకరీ దేవి కొలువైన ప్రదేశంగా భావిస్తున్నారు. (ఈ ఆలయ ఆనవాలులు పోర్చుగీసుల దాడి కారణంగా కనిపించుట లేదు.)

కామాక్షీదేవి: Kanchipuram
--------------
కామాక్షీ దేవి ఆలయం కాంచీపురం, తమిళనాడు ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడినట్టు చెప్పే ప్రదేశం. ఇక్కడ అమ్మవారు కామాక్షి రూపంలో కొలువై ఉంది.

శృంఖలాదేవి:Pandua (West Bengal)
------------------- అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈశృంఖలాదేవిని అక్కడి వారు చోటిల్లామాత గా పూజిస్తారు. పాండువానే అసలైన శివక్షత్రమని, ఇది పశ్చిమబెంగాల్లో వెలసి ఉంది.

చాముండేశ్వరీదేవి:Mysore
------
ఈ ఆలయం మైసూరు, చాముండి పర్వతాలపై, కర్ణాటకాలో ఉంది. ఈ ప్రదేశంలో ఆ పరమేశ్వరుడి రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ఈపర్వతాలపై పడ్డాయని స్థల పురాణం చెబుతుంది.

జోగులాంబాదేవి:Alampur
-------
మన రాష్ట్రంలో వెలసిన నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబా శక్తిపీఠం.ఇది ఆలంపూర్, తెలంగాణ రాష్టంలో ఉంది. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు, దవడ భాగం పడినట్లు చెప్పే చోటు.

భ్రమరాంబికాదేవి:Srisailam
---------
శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు చక్రంతో ఖండిప బడిన సతి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయితే ఇక్కడే పరమేశ్వరుని యొక్క ద్వాదశ జోతిర్లింగ క్షేత్రంకూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

మహాలక్ష్మీదేవి:Kolhapur
--------
ఆది పరాశక్తి ‘అంబాబాయి'గా కొల్హాపూర్, మహారాష్ట్ర వెలసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు.

రేణుకాదేవి:Mahur
-----
మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో, మాహుర్ క్షేత్రంలో వెలిసిన తల్లి రేణుకాదేవి. ఇక్కడి వారు ఈ తల్లిని ఏకవీరికాదేవిగా కొలుస్తారు. సతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల నుండి పూజలందుకుంటున్నది.

మహాకాళీదేవి:Ujjain
--------
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని దేవీ భాగవతం తెలుపుతోంది. ఇక్కడ ఈ తల్లి మహంకాళీ రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి.

పురుహూతికాదేవి:Pithapuram
-----------
పురాణ ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠబాగం పడిన చోటు కాబట్టి, ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణలు తెలుపుతున్నాయి.

గిరిజాదేవి:Jajpur
-------
ఒడిశా, జాజ్‌పూర్ లో వెలసిన తల్లి గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని అక్కడి స్థానికులు బిరిజాదేవిగా , విరిజాదేవిగా కొలుస్తారు.

మాణిక్యాంబాదేవి:Draksharamam
------------
ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్ లో సతీ దేవి ఎడమ చెంప భాగం పడినట్లు, ఈ ప్రదేశాన్ని ద్రాక్షారామంగా, దక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచారామక్షేత్రంగా వెలసింది.

కామరూపాదేవి:Guwahati
-------
అసోం రాజధానికి గువాహటిలోని నీలచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థలపురాణం.

మాధవేశ్వరీదేవి:Prayaga
--------
అమ్మవారి కుడిచేతి వేళ్ళు ప్రయాగ, ఉత్తరప్రదేశ్ లో పడినట్లు చెబుతారు. ఇక్కడ సతీదేవిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రం ఉండదు. నాలుగు దిక్కులా సమానంగా కట్టన పీఠం మాత్రం ఉంటుంది.

వైష్ణవీదేవి:Kangra
-------
కాంగ్రా, జ్వాలాముఖి, హిమాచల్‌ప్రదేశ్ వెలసిన దేవీ వైష్ణోదేవి. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలముఖిగా భక్తులకు దర్శనమిస్తారు.

సర్వమంగళాదేవి:Gaya
-----
సతీదేవి శరీరభాగాల్లో స్తనాల బీహార్ లోని గయా ప్రాంతంలో పడినట్లుగా చెబుతారు. ఈ అమ్మవారే మంగళగౌరీదేవి. ఈ స్థలపురాణానికి తగినట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు.

విశాలాక్షీదేవి:Varanasi
--------
సతీదేవి మణికర్ణిక(చెవి భాగం) వారణాసి, ఉత్తరప్రదేశ్ పడిందని, ఈ ప్రదేశం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయసమీపంలో ఉన్నట్లు స్థలపురాణం తెలుపుతోంది.

సరస్వతీదేవి :Sharada Peeth
-------------
పాక్ అక్రమిత ప్రదేశమైన కాశ్మీర్ లోని ముజఫరాబాద్ కు దాదాపు 150కిమీ దూరంలో ఈ శక్తిపీఠం ఉండేదని చెబుతారు.