రాఖి పండుగ

రక్షా బంధన్
----------------
రక్షా అంటే రక్షణం . రక్షణకై ధరించే సుత్రాది కంకణం , తయోత్తు అని అర్థాలు . కనుక రక్షగా నిలిచేది ,రక్షణ కల్పించేది రక్షా అవుతుంది . రక్షా శబ్దమే రాఖి అయింది . ఇందు లో తోరాన్ని కుడిమొంజేతికి ధరించడం ప్రధానాంశం . మంత్రాలతో పవిత్రమైన ఆ తోరమందాలి శక్తి అమంగాలన్నీ తొలిగిస్తుంది .
రక్షాధారణ సమయం :
-------------------------
శ్రావణ పూర్ణిమ నాడు ఉదయం సమయం లో కాని , సాయం కాలం చీకటి పడే వేళలలో గాని ,రక్షాదారణ చేసుకోవుచ్చు .
రక్షాధారణ మంత్రం :

----------------------
యేన బద్దో బలీ రాజా దానవెంద్రో మహాబలః
తేన త్వా మభిబద్నామి రక్షె ! మా చల మా చల !!
ఓ రక్షా (తోరమా ) మహా భలవంతుడు ,రాక్షస రాజు అయిన బలిచక్రవర్తిని బందిన్చినావు . కనుకనే నేను నిన్ను ధరిస్తున్నాను ,సుస్థిరంగా ఉండు .
ఈ మంత్రం పరమపవిథ్రమైనది ,ఎన్నో జన్మల పుణ్యఫలం వలెనే ఈ మంత్రాన్ని పటించే సంకల్పం గాని ,అవాకశం గాని లబిస్తుంది .
నేను నాది అనే అహంకారం తో బలి విర్రవిగాడు ,ఇంద్రుని చేతికి శచీదేవి కట్టిన రక్షాశక్తి ,బలిని బంధించింది, ఇంద్రునికి విజయాన్ని సందించింది . అట్టి శత్రు బంధన శక్తి ,విజయకారక శక్తి కల్గిన రక్షా ను -ఆనాటి సన్నివేశాన్ని స్మరిస్తూ కట్టుకొని ,ఆ శక్తి తననుండి వెల్లిపొవొద్దు అని ప్రార్తించడమే ఇందలి తాత్పర్యం ! మానవుణ్ణి రజస్తమో గుణాల నుండి మళ్ళించి ,సత్వగుణ విశిస్టున్ని చేస్తుంది రక్షా !
భగవంతుని సన్నిది లో పెట్టి ,పూజించిన రక్షా ను ధరించడం వలన నిర్మలమనస్కులై ,సకలభ్యుదాయాలు పొంది .సుఖ శాంతులతో వర్దిల్లుతారు . మనస్సు స్థిరమైతే రక్షా శక్తి కుడా స్థిరంగా ఉంటుంది.
ఇలా శ్రావణ పూర్ణిమ నాడు అన్న-చెల్లల్లు ,అక్క-తమ్ములు ఎవరైనా మనకు రక్షాగా ఉంటారు అనుకునే వాళ్ళకు సోదరభావం తో రక్షా కట్టొచ్చు .అభ్యుదయకోసం ,విజయశక్తి కోసం ,మంత్రం పూర్వకంగ జరుగుతున్నా రక్షాధారణ సంప్రదాయం ఎంతో సనాతనము ,పవిత్రమైన సదాచారం .