Rahu Ketu Dosha Nivarana Puja-Temples

శ్రీ కళాహాస్తీస్వర స్వామి దేవాలయం -శ్రీ కళాహస్తీ:Srikalahasti
---------------------------------------పూర్వం ఒక అడవి లో ఒక శివలింగం ఉండేది . ఏనుగు ఒకటి రోజు సువర్ణ ముఖి నది లో స్నానం చేసి కొంత నీరు పుక్కిలి పట్టి తెచ్చి ఆ నిటి తో లింగానికి అభిషేకం చేసి పులు పత్రి తెచ్చి పూజ చేసేది . ఏనుగు వెళ్ళిపోగానే ఒక పాము వచ్చి ఆ ఆకులూ ,పులు ప్రక్కకు జరిపి రత్నాలతో పూజించేది . ఒక సాలె పురుగు స్వామీ చుట్టూ గుడు అల్లి సేవించేది . ఐతే ఒకరి పూజ ఒకరికి నచ్చేది కాదట .. తమలో తము బాద పడేవారట . చివరకు ముగ్గురు స్వామి అనుగ్రహంతో ముక్తి పొందటం తో కథ సుకన్థమైన్ది అని చెబుతారు . ఆ శివ లింగమే శ్రీ కళాహస్తీస్వరుడిగా ( శ్రీ అంటే సాలె పురుగ, కాళము అంటే పాము , హస్తి అంటే ఏనుగు ) . భక్త కన్నప్ప స్వామి వారి పరిక్ష్ లో రెండు కళ్ళు ఇచ్చేసి స్వామి వారి కృప తో మోక్షం పొందాడు .

గూడూరు నుండి తిరుపతి వెళ్ళే మార్గం లో ఉన్న ఈ మహిమన్మితమైన క్షేత్రం కి ఘనమైన చరిత్ర ఉంది . గోపురాలు ఎత్తుగా ఉండి శిల్ప సంపదతో కుడి ఉన్నాయి . ఇక్కడ లింగము వాయు లింగం అని ప్రసస్తి . గర్భ గుడి లో ఉన్న ఒక దీపం ఇందుకు నిదర్శనంగా ఎప్పుడు కదులుతూ ఉంటుంది . శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ , అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం.

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు)గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.
ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్టింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజుప్రతిష్టించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.
ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.
మహా శివరాత్రికి కి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి . తిరుపతికి ముఫ్ఫై ఎనిమిది కి.మీ.ల దూరంలో నెల్లూరుకు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి ఇక్కడికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంటుంది.

You can also go through the temple web site.

http://www.srikalahasti.org/
How to Reach:
---------------
By Road/Bus: hyderabad to Kalahasti is 11 hours journey. by road.

స్కందగిరి సుబ్రమణ్య స్వామి దేవాలయం -పద్మారావు నగర్:Skandagiri Surbamanya swamy temple
---------------------------------------సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 2 కి మీ దూరం లో గల పద్మ్రావు నగర్ లో గల శ్రీ వల్లిసేన సమేతా సుబ్రమణ్య స్వామి దేవాలయం ఎంతో శక్తి వంతమైనది మరియు మహిమన్మితమైనది . ఆలయ ప్రాంగణం లో మహాగణపతి, శ్రీ ఎకంబరేశ్వర,కామాక్షి దేవి ల తో వెలుగుతున్నాడు . ఆలయం లో నవగ్రహ మండప కూడా ఉన్నది . వినాయక చవితి,సంకట చతుర్థి ,సుబ్రమణ్య శేస్టి లాంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు .కుటుంబ కలహాలు ,రాహు-కేతు దోషాలు ఉన్నవారు స్వామి వారి సన్న్డిది కి వచ్చి మొక్కుకొని వెళ్తుంటారు . అవి తీరగానే మల్లి వచ్చి ముడుపులు చెల్లిస్తారు .


How to Reach:Very Near to Secunderabad Railway Station
-------------
శ్రీ బ్రహ్మరంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం - పేద కాకాని:Peda Kakani
---------------------------------------సుప్రీ సిద్ద శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ గంగ బ్రహ్మరంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం గుంటూరు పట్టణానికి 7 కి మీ దూరం లో గల పెద్ద కాకాని గ్రామం లో వెలసి ఉన్నది . ఎంతో పురాతనమైన, చరిత్రాత్మకమైన ఈ శివాలయం, ఆది శంకరాచార్యుల చేత ప్రతిష్టింపబడి, శ్రీకృష్ణదేవరాయలచే పునః ప్రతిష్టింపచేయబడింది మరియు రాష్ట్ర ప్రఖ్యాతి గాంచినది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా, ఎంతో దూరం నుండి భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతున్నది. నవరాత్రులు, శివరాత్రి ఒకటేమిటి, నిత్య కైలాసమే ఈ క్షేత్రం.

ఇంద్రకిలద్రికి మరియు గర్తపురికిని మద్యన గల యొక సుందరవనమునందు సిద్దయోగి ఆయన ఒక మహాబక్తుడు పరమేశ్వరుని కోసం యుగాల తరబడి తప్పస్సు చేసాడట ఆ ప్రదేశమే పెద్ద కాకాని పుణ్య క్షేత్రాముగా పిలవబడుతున్నది పరమ శివుడు ప్రత్యక్షమై భక్తుని కోరిక మేరకు శివలింగ రూపం లో ఈ క్షేత్రం లో వెలసి ఉన్నాడు అని పురాణాలూ చెబుతున్నాయి.ఆలయం లో శైవగమ పద్దతిలో పూజ కర్యాక్రమాలు నిర్వహించాబడుతాయి . భరద్వాజ మహర్షి తన దక్షిణ యాత్ర సమయం లో ఈ క్షేత్రం లో ఉన్నాడు అని కొన్ని రోజులు యాగాలు నిర్వచించాడు అని స్థల పురాణం .

అష్టాదశ శక్తులలో ఒకరైన శ్రీ బ్రహ్మరాంబ దేవి ,ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి దర్శం వలన కలిగే ప్రయోజనం ఈ క్షేత్రాన్నిదర్శిస్తే సిద్దిస్తుంది అట .ఈ క్షేత్ర దర్శనం వలన సంతానం , మరియు పెళ్ళికాని వారికి తొందరగా వివాహాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం .

ఈ ఆలయం లో వివిధ మూర్తులు కొలువై ఉన్నారు .

నవగ్రహ దేవేలయం

రాహు-కేతు దేవాలయం
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం
శ్రీ సుబ్రమణ్య స్వామి దేవాలయం .
ఈ ఆలయం లో రాహు-కేతు దోష నివారణా పూజలు నిర్వహించాబడుతాయి . చాల పవిత్రమైన క్షేత్రం కూడా దోష నివారణకు .

How to Reach:Very Near to Guntur and Vijayawada
-------------