ద్వాదశ ఎకాదశులు1.హరి ఏకాదశి

-------------
చైత్ర మాసంలో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని హరి ఏకాదశి అంటారు . ఇది మొదటి ఏకాదశి కాబట్టి రాబోయే 11 మాసాల్లో ఈ నేలనుండి ప్రారంబించి ఏ ఏ నియమాలతో ఏకాదశి వ్రతాన్ని పాటించాలో తెలుసుకోవాలి .ఉదయం లేచి శ్రీ విషను సహస్రానామ్లని చదువుతూ శ్రీ హరి ని అర్చించాలి . 12 నెలల పాటు రోజు రోజంతా ఆరోగ్యం సహకరించకపోతే రాత్రి వరకు ఉపవసిస్తని సంకల్పించుకొవలి.

2.మోహిని ఏకాదశి

----------------
వైశక మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు . దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని తెచ్చారు .
తెచ్చిన అమృతాన్ని సగం సగం పంచుకోవాలి అందరు ఎదురు ఎదురు ఉండగా రాక్షసులకి మద్యపు వాసన వచ్చింది వారంతా మద్యం వైపుకు వెళ్ళిపోయారు . దేవతల పంక్తి లో ఒకడు కకూర్చోగ వాణ్ణి సూర్య చంద్రులు గ్రహించి శ్రీ హరికి సైగ చేసారు . అంతట శ్రీ హరి మోహిని రూపాన్ని దరించి ఆ రాక్షసుణ్ణి రెండు గ చేస్తే తల రహువుగాను మొండెం కేతువ గాను అయింది . అందుకే దీనిని మోహిని ఏకాదశి అని అంటారు .

3.నిర్జల ఏకాదశి

---------------
జ్యేష్ట శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు . జ్యేష్ట ఆషాడ మాసాల్లో రెండుతిని కలిపి గరీశం ఋతువు అంటారు . జ్యేష్ట మాసం లో వచ్చే ఏకాదశి కి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఆ రోజు ఏ మాత్రపు నీటిని తాగకుండా ఉపవసించ్దమెదున్ద్ అది నిర్జల ఏకాదశి .

4.శయనై ఏకాదశి
-------------------
ఆషాడ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని శయనై ఏకాదశి అంటారు.శ్రీ మహా విష్ణువు ఈ ఏకాదశి నుండి యోగ నిద్రలోకి వేల్లదలిచి,
తన రక్షణ బాద్యతలను లోకం లో ఉండే తపోజనులు మీద ఉంచి 4 నెలల పాటు ఎవరికి దర్శనాన్ని ఇవ్వడు . నిద్రకి ఉపక్రమించే ఏకాదశి కాబట్టి దీనిని శయనై ఏకాదశి అని అంటారు .

5.పుత్రాద ఏకాదశి
--------------------
శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి అంటారు. వివాహమై సంతానం లేక బాదపడుతుంటే జంట ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ హరిణి విష్ణు సహస్రానామలతో అర్చిన్చినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది. అందుకీ దీనిని పుత్రాద ఏకాదశి అని అంటారు .

6.పరివర్తన ఏకాదశి
--------------------
భాద్రపద మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశిఅంటారు. శయన ఏకాదశి పేరిట శ్రీ హరి యోగ నిద్రలోకి వెల్తాడో సరిగా రెండు నెలల తరువాత ఇంకో పక్కకి ఒత్తగిల్లుతాడు . అల పరివర్తనం చేసి ఏకాదశి కాబట్టి పరివర్తన ఏకాదశి అని అంటారు . నైరుతి ఋతుపవనాలు దీశ మరి ఈశాన్య ఋతుపవనాలు ప్రరంబమయ్యేది నేటి నుండే .

7.విజయ ఏకాదశి
--------------------
అస్విజ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని విజయ + ఏకాదశి =విజయ ఏకాదశి అంటారు . విజయ దశమి నాడు విజయ ముహార్తుం లో అంటే దాదాపు సాయంత్రం 4 నుండి 6 మద్య లో జమ్మి చెట్టుకింద అపరాజిత దేవిని ఆవహింప చేసి ప్రదిక్షనల్ను చేస్తారో ,పూజిస్తారో ,ఆ శక్తి మరసటి రోజు కూడా ఉంటుంది అందుకే దీనిని విజయ ఏకాదశి అంటారు

8.ఉత్తాన ఏకాదశి
--------------------
కార్తిక మాసం లో వచ్చే శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు . శ్రీ హరి యోగ నిద్రలో నుండి తిరిగి నలుగు నెలల తరువాత మేల్కొని ఉంటాడో దానినే ఉత్తాన ఏకాదశి అంటారు . శ్రీ హరి మేల్కొనే సందర్బం లో గరుడ ,గందర్వ కిన్నెరా లో స్వామి వారిని చూడడానికి సిద్దంగా ఉంటారు .

9.మోక్షద ఏకాదశి
--------------------
మార్గశిర మాసం లో వచ్చే శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు .కార్తిక భహుఅల పక్షం లో త్రయోదశి రోజు యుద్ద్ధం ప్రారంబం కాగ బీష్మ పీతామహుడు మార్గశీర్ శుడా దశమి నాడు అమ్పశయ్యకి చేరాడు అందుకీ ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు

10.వైకుంట(ముక్కోటి) ఏకాదశి
--------------------
పుష్య మాసం లో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంట(ముక్కోటి) ఏకాదశి అంటారు. మార్గశిర పుష్య మాసాలు రెండు హేమనత రుతువులోనికి వస్తాయి. రెండు ఆధ్యాత్మికతను బాగా పెంపొందించే లక్షణం కలవి కాబట్టి భగవద్గీత బోదించబడింది . పుష్య మాసం లో శుద్ధ ఏకాదశి నాడు శరీరానికి ఉత్తర బాగమైన బ్రహ్మ రంద్రం లో భగవంతున్ని దర్శనం చేయాలి .ఇదె ఉత్తర ద్వార దర్శనమ అంటే . ముక్కోటి దేవతలను వైకుంతం లో దర్శించగల అదృష్టాన్ని ఇచ్చే ఏకాదశి .

11.బీష్మ ఏకాదశి
--------------------
మాగామాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని బీస్మ ఏకాదశి అంటారు . బీష్మ పీతామహుడు మాగా శుద్ధ అష్టమి వచ్చే సరికి భగవంతున్ని తన వద్దకు రప్పించుకొని ఆయన్ని దర్శిస్తూ ఆయనలో లీనం కాగలిగాడు . శ్రీ హరి తనకీస్తమైన ఎకదశ్ని బీష్ముని పేరిట అనుగ్రహిస్తూ బీస్మ ఏకాదశి అని ప్రకటించాడు .

12.సంతానైఏకాదశి
--------------------
పాల్ఘున మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని సంతానైఏకాదశి అంటారు . శిశిర రుతువులోనికి వచ్చే మాఘ పల్గునల్లో ఇది రెండవ నెల . ఆకులన్నీ రాలిపోయి తిరిగి చిగార్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని చేస్తూ ప్రకృతి ఎలా కనిపిస్తుందో ,ఆలా సంతానం లేక నీరాశ తో ఉన్నవారికి ఈ ఏకాదశి రాబోయే వసంత కాలం లో ఉత్సాహాన్నిచ్చి విశేషించి సంతానాన్ని కలిగిస్తుంది . కాబట్టి దిని సంతానైఏకాదశి అంటారు